మెహబూబా తో హీరోగా రీ లాంచ్ అయ్యాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్. అయితే ఈ చిత్రం విజయాన్ని అందిచలేకపోయింది. దాంతో కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం తన రెండవ చిత్రంలో నటిస్తున్నాడు.
రొమాంటిక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ పడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి మందిర బేడీ ని తీసుకోగా తాజాగా మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే ను ఒక ముఖ్యమైన పాత్రకోసం తీసుకున్నారు. చార్మి ,పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


