మహనటి తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మహానటి ఫేమ్ ధని సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ విడుదలకానుంది.
ఇక ఈ చిత్రం తోపాటు కీర్తి ఇటీవల బాలీవుడ్ సినిమా కి కూడా సైన్ చేసింది. అమిత్ షా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కీర్తి , అజయ్ దేవగన్ తో కలిసి నటించనుంది. హిందీలో ఆమె కు ఇదే మొదటి సినిమా.


