బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గత ఏడాది థగ్స్ హిందుస్థాన్ అనే చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం అమీర్ కు భారీ షాక్ ఇచ్చింది. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది ఈ చిత్రం.
ఇక ఈ చిత్రం తరువాత అమీర్ హాలీవుడ్ లో విజయం సాధించిన ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా రీమేక్ లో నటించాడని ఓకే చెప్పాడు. ఈచిత్రం కోసం ఆయన ఏకంగా 20కిలోల బరువు తగ్గనున్నాడట. అందులో భాగంగా ఇటీవల 3కిలోలకు పైగా తగ్గాడట. ఇక అమీర్ పూర్తిగా బరువు తగ్గాకే సెట్ లో అడుగుపెట్టనున్నాడు.


