బాలీవుడ్ సినిమా నుంచి గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న అవైటెడ్ చిత్రమే ‘రామాయణ’. బాలీవూడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ఆల్రెడీ వచ్చిన ట్రైలర్ తో మ్యాజిక్ చేసింది.
పాన్ వరల్డ్ లెవెల్లో నెవర్ బిఫోర్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేతలు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, అలాగే మన నుంచి ఏ ఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు వర్క్ చేశారు. ఇక ఆడియో పరంగా కూడా మంచి హైప్ ఉన్న ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం రామాయణ మొదటి పాటని మేకర్స్ ఈ సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా డేట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ లు నిర్మాణం వహించగా ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 8న సినిమా విడుదల కాబోతుంది.


