సూర్య మొత్తానికి హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు అంగీకరిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా దర్శకుడు శివ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గానే రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కాగా శివ గోపీచంద్ ‘శౌర్యం’ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించి తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి శివ – సూర్య కాంబినేషన్ లో వచ్చే సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి.


