సుప్రీమ్ హీరో సాయి తేజ్ ‘చిత్రలహరి’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాడు. ఇక ఈచిత్రం నుండి ఇటీవల రెండు సాంగ్స్ విడుదలకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి మూడవ సాంగ్ ‘ప్రేమ వెన్నల’ ఈ రోజు విడుదలైయింది. ఇక ఈ సాంగ్ దేవి ఇటీవల కంపోజ్ చేసిన సాంగ్స్ లోకెల్లా బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ బ్యూటిఫుల్ మెలోడీ కి శ్రీమణి లిరిక్స్ అందించగా రీ ఫ్రెషింగ్ ట్యూన్స్ తో దేవి అదరగొట్టాడు.
రొమాంటిక్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్నా ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.


