నా పేరు సూర్య తరువాత ఏడాది కి పైగా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ ని చేయనున్నాని ప్రకటించాడు. అయితే ఆ న్యూస్ ప్రకటించి 3నెలలు అవుతున్న ఇంతవరకు బన్నీ గాని చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక మరో వైపు బన్నీ అభిమానులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అందులో ఎవరు ఎవరు నటిస్తారో తెలుసుకోవాలని చాలా అతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలావుంటే అల్లు అర్జున్ రేపు తన పుట్టిన రోజు ను జరుపుకోనున్నాడు. మరి రేపైనా ఈ చిత్రం గురించి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తాడో లేదో చూడాలి. ఇక ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ తో సినిమా చేయనున్నారు. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.


