స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్దా తీసుకుంటుందని ఆమె ట్విట్టర్ , ఇంస్టాగ్రాం ను చూస్తే తెలిసిపోతుంది. ఇక మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఫిట్నెస్ కు సంబంధించిన సలహాలను ,సూచనలను ఎప్పిటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వుంటుంది.
ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఒక హెల్త్ ఛానెల్ నిర్వహించిన చిట్ చాట్ లో సమంత ను ఇంటర్వ్యూ చేసింది ఉపాసన. అందులో భాగంగా సమంత ను తన డైట్ గురించి కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఉపాసన. త్వరలోనే దానికి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ విడుదలకానుంది.


