‘విశ్వామిత్ర’ ‘మే’లో వస్తున్నాడు !

‘విశ్వామిత్ర’ ‘మే’లో వస్తున్నాడు !

Published on Apr 13, 2019 7:44 PM IST

Viswamitra

అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. జీవితంలో ఆమెకు ఎదురైన సమస్యలను ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అనేది మా సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రాజకిరణ్. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వామిత్ర’.

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకం పై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్ జంటగా నటించారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ “విశ్వంలో మానవ మేధస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి. సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో… చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు.

విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, ‘కార్టూనిస్ట్’ మల్లిక్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు