పవన్ ఓటమి గురించి రామ్ చరణ్ ఏమన్నాడంటే !

పవన్ ఓటమి గురించి రామ్ చరణ్ ఏమన్నాడంటే !

Published on May 24, 2019 4:13 PM IST

Ram charan1

నిన్నటి ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో ఓడిపోయారు. దీంతో జనసేన శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యాయి. అంతా ఓటమిపై సమీక్షలు చేసుకుంటున్నారు. కొందరు అభిమానులు, కార్యకర్తలు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

ఈ తరుణంలోనే మొదటి నుండి బాబయిని సపోర్ట్ చేస్తూ వచ్చిన స్టార్ హీరో రామ్ చరణ్ ఓటమిలో సైతం బాబాయ్ మద్దతుగా నిలబడ్డారు. ఆయన జనసేన ఓటమిని ప్రస్తావిస్తూ గొప్ప లీడర్లు కేవలం లీడర్లుగానే మిలిగిలిపోరు… వాళ్ళు మార్పు తీసుకువస్తారు. ఇక్కడ పదవుల ముఖ్యం కాదు లక్ష్యం ముఖ్యం. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు