మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఇరుముడి. అభిమానులు రవితేజకి సాలిడ్ హిట్ రావాలని ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో అంతకు మించిన రేంజ్ హిట్ ని రవితేజ అందించి ఎవరి ఊహకి కూడా అందని రేంజ్ ఓపెనింగ్స్, బుకింగ్స్ తో ట్రేడ్ వర్గాలకు షాకిచ్చారు.
అయితే విడుదల రోజు నుంచి అంతకంతకు గ్రాఫ్ పెంచుకుంటూ వెళుతున్న ఇరుముడి ఇప్పుడు మూడో రోజు రెండో రోజు కంటే భారీ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడ నుంచి రవితేజ సినిమాకి అసలు టెస్ట్ మొదలైంది అని చెప్పవచ్చు. వీకెండ్ అయ్యాక వర్కింగ్ డేస్ లో పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందా అని చాలా మందిలో డౌట్ ఉంది కాని నాలుగో రోజు బుకింగ్స్ కూడా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో సోమవారం టెస్ట్ కూడా ఇరుముడి ఈజీగా పాసయ్యే ఛాన్స్ ఉంది.


