`మహానటి` ఫేం బేబి సాయితేజస్వీని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన నటకిరీటి రాజేంద్రప్రసాద్, స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, `ఫస్ట్ లుక్ లో హారర్ కోణం కనిపిస్తుంది. సాయి తేజస్వీని వయసులో చిన్నదైనా చక్కగా నటించింది. రాజా దిగ్రేట్ సినిమాలో ఆ బేబితో నే ఓ పాత్ర చేయించాలనుకున్నా. కానీ వయసు తక్కువని ఆలోచించి ఆ ఛాన్స్ మిస్సయ్యాను. సాయితేజస్వీని భవిష్యతో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. రాజేంద్ర ప్రసాద్ గారిని డాడి అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. సరిలేరు నీకెవ్వరు లో ఆయన ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. మహేష్ బాబు కాంబినేషన్ లో ఆయనకు మంచి సన్నివేశాలున్నాయి` అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యుటివ్ నిర్మాత తోట సతీష్ , గీతాసింగ్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


