మన టాలీవుడ్ మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. తనదైన మాస్ టేకింగ్ తో మంచి ఆదరణ అందుకున్న బోయపాటి శ్రీను నుంచి ఇటీవల అఖండ 2 వచ్చి అభిమానులని అలరించింది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారగా ప్రస్తుతం కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్టు టాక్.
ఇలా బోయపాటి నెక్స్ట్ సినిమాగా బాలీవుడ్ లోనే చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మన టాలీవుడ్ బాలయ్య లానే బాలీవుడ్ కి ఓ బాలయ్య ఉన్నారు. అతనే సన్నీ డియోల్. తనతో కొన్నాళ్ల కితం దర్శకుడు గోపీచంద్ మలినేని తీసిన సాలిడ్ యాక్షన్ చిత్రం ‘జాట్’ తర్వాత సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కానీ దీనిని మరో దర్శకుడు తెరకెక్కిస్తారు అని వినిపించింది.
ఇప్పుడు దర్శకునిగా బోయపాటి శ్రీను పేరు లాక్ అయినట్టు సమాచారం. ఆల్రెడీ పార్ట్ 1 చూసే చాలామంది బోయపాటి సినిమా లానే ఉందని అన్నారు. ఇప్పుడు అలాంటిది బోయపాటినే తీస్తే.. ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.


