నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`. ఈ చిత్రం జూన్ 21న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంది. అలాగే ట్రైలర్ లో విజువల్స్ కూడా బాగున్నాయి, పైగా గ్రిప్పింగ్ గా ఉంది. ఇక హీరో పాత్ర కామిక్ గా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించారు.
నవీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రధారిగా నటించారు. సినిమా ఆసాంతం ఎంటర్ టైనింగ్‌గా ఉంటుందట. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు. మళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.