సినీ దిగ్గజం విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి !

సినీ దిగ్గజం విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి !

Published on Jun 28, 2019 3:00 PM IST

vijayanirmala

గుండెపోటుతో గురువారం మృతి చెందిన సినీ దిగ్గజం విజయనిర్మల న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ఆమె అంత్యక్రియలు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌ లో ముగిశాయి. విజయనిర్మల కుమారుడు నరేష్‌.. విజయనిర్మల చితికి నిప్పటించారు. విజయనిర్మల అంతిమ సంస్కారంలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

అభిమానులు పెద్ద సంఖ్యలో తమ అభిమాన నటి కడసారి చూపు కోసం తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు.

తాజా వార్తలు