అఫీషియల్: ‘విశ్వంభర’ కోసం మిరాయ్ సంగీత దర్శకుడు కూడా!

అఫీషియల్: ‘విశ్వంభర’ కోసం మిరాయ్ సంగీత దర్శకుడు కూడా!

Published on Aug 22, 2026 9:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఫాంటసీ వండర్ చిత్రం విశ్వంభర కూడా ఒకటి. నిజానికి ఎప్పుడు మొదలైన ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఈ ఏడాది ఇట్టి పరిస్థితుల్లో దసరాబుల్లో నిలుస్తుందని శని వర్గాల నుంచి గట్టి టాక్ అయితే ప్రస్తుతానికి ఉంది కానీ మేకర్స్ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ని హోల్డ్ లోనే ఉంచారు.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హను మాన్ మిరాయ్ లాంటి సినిమాలు కి అద్భుతమైన సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు గౌర హరి బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందిస్తున్నట్టుగా ఆ మధ్య వినిపించింది.

ఇప్పుడు ఫైనల్ గా దీనిపై ఒక క్లారిటీ బయటకు వచ్చేసింది. లేటెస్ట్ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో సంగీతం తనదే అన్నట్టుగా నీ కొత్త జర్నీకి అందరి ఆశీస్సులు కావాలని తను పోస్ట్ చేశాడు. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు తన పనితనం ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఈ సినిమాలో త్రిష ఆశికా రంగనాథ్ నటిస్తుండగా యోగి క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు