పాయల్, కాజల్ ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ !

పాయల్, కాజల్ ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ !

Published on Jul 2, 2019 10:33 AM IST

మొత్తానికి టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కి రానన్నీ అవకాశాలు పూజా హెగ్డేకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తోన్న ఈ అమ్మడు నాన్ స్టాప్ గా పెద్ద సినిమాలు అంగీకరిస్తూ దూసుకెళ్తుంది. పైగా వేరే హీరోయిన్ల అవకాశాలను కూడా కాజేస్తోంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న బంగార్రాజులో మొదట ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని లేదా కాజల్ అగర్వాల్ ని నాగ్ పక్కన హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు.

చివరికీ ఆ ఇద్దరి హీరోయిన్స్ అవకాశాన్ని పూజా హెగ్డే లాగేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే పూజ హెగ్డేతో బాంగార్రాజు చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపిందట. త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి నాగార్జున సరసన పూజా హెగ్డే ఏ రేంజ్ లో నటిస్తోందో చూడాలి. పూజా హెగ్డే ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ అవకాశలను దక్కించుకుంటుంది. రీసెంట్ గా మహర్షి హిట్ పూజా హెగ్డేకి బాగానే కలిసి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు