“ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి

“ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి

Published on Jul 4, 2019 1:25 PM IST

RRR1

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ఆర్ ఆర్ ఆర్” మూవీ షూటింగ్ కి తాత్కాలిక విరామం ప్రకటించారు. రాజమౌళి వ్యక్తిగత పనిపై అమెరికా వెళ్లిన నేపథ్యంలో ఒక వారం రోజులు చిత్రీకరణ ఆపివేసినట్లు ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు.చరణ్,తారక్ లు ఈ మూవీ చిత్రీకరణ సమయంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే.గాయాల నుండి కోలుకున్న ఇద్దరు నటులు కొద్దిరోజులగా ప్రత్యేకమైన సెట్ లో కీలకమైన యుద్ధసన్నివేశాలలో పాల్గొంటున్నారు. ప్రకటించిన సమయానికే సినిమాని విడుదల చేయాలని పట్టుదలగా రాజమౌళి నిరవధిక షూటింగ్ చేస్తున్నారు

ఈ చిత్రంలో చరణ్ సరసన నటిస్తున్న అలియా భట్, మరో కీలక పాత్రలో కనిపించనున్న అజయ్ దేవగణ్ త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. 2020జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు