మంచు మోహన్ బాబుకి ఆ పదవి ఇవ్వలేదు

మంచు మోహన్ బాబుకి ఆ పదవి ఇవ్వలేదు

Published on Jul 4, 2019 10:54 PM IST

mohan babu

ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు వైకాపాలో చేరి జగన్ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ గెలిచిన తర్వాత మోహన్ బాబుకుఏదైనా కీలక పదవి ఇస్తారనే ప్రచారం మొదలైంది. కొన్ని రోజుల క్రితం టీటీడీ చైర్మన్ పదవిని జగన్ మోహన్ బాబుగారికి ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ వాటిలో నిజంలేదని అప్పుడే మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్‌ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌.డి.సి) చైర్మ‌న్‌గా ఆయన నియమితులు కానున్నారని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ఊపందుకున్నాయి. కానీ వాటిలో కూడా ఏమాత్రం నిజంలేదని, అవి కూడా గాలి వార్తలేనని ఆయన పి.ఆర్ టీమ్ క్లారిఫై చేసింది. ఇకపోతే కలెక్షన్ కింగ్ సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ‘సూరరై పోట్రు’ అనే సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు