‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ !

‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ !

Published on Jul 5, 2019 1:46 AM IST

ismart

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జూలై 7న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఈవెంట్ ను చిత్రబృందం నిర్వహించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన పాట‌ల‌కు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరికొత్త లుక్‌ లో కనపింబోతున్నారు. సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు