‘మహానటి’ దర్శకుడి అసలైన సోషల్ ఛాలెంజ్.

‘మహానటి’ దర్శకుడి అసలైన సోషల్ ఛాలెంజ్.

Published on Jul 18, 2019 9:41 AM IST

Nag Ashwin

దేశంలో అనేక ప్రాంతాలలో నీటి కొరత ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన నీటి కొరత పట్టణాలకు కూడా పాకింది. దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన చెన్నై నీటి విషయంలో ఎంతటి దుర్భర పరిస్థితిని అనుభవిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆ నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన జలవనరులు అడుగంటడంతో దారుణమైన నీటి కష్టాలను వారు చవిచూశారు. ఈ సమస్య దేశంలోని మిగతా నగరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది,వాటిలో హైదరాబాద్ కూడా ఒకటి.

ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే నీటిని ఆదాచేయడం అనేది ఒక మార్గం. “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ దీనికి పరిష్కారంగా ఓ వినూత్నంగా ‘వన్ బకెట్’ ఛాలెంజ్ ని ప్రచారం చేస్తున్నారు. కనీసం ఒక్కరోజైనా కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి దిన చర్య ముగించాలని పిలుపునిస్తున్నారు. రోజు వారి అవసరాలైన బ్రష్,బాత్,టాయిలెట్,హ్యాండ్ వాష్ ఇలా అన్ని అవసరాలకు కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించాలని ట్విట్టర్ వేదికగా ఆయన సందేశం పంపారు.

జులై 21 అనగా ఈ ఆదివారం కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి మీ సామజిక బాధ్యత నెరవేర్చమంటున్నాడు. ఎవరికీ ఉపయోగం లేని,ఐస్ బకెట్,రైస్ బకెట్ ఛాలెంజ్ లు సీరియస్ గా తీసుకొని చేసే జనాలు మరి ఈ వన్ బకెట్ ఛాలెంజ్ ని ఎంత మంది స్వీకరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు