మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ 158వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ పై మంచి అంచనాలు నెలకొనగా షూటింగ్ కూడా అంతే జెట్ స్పీడ్ లో చేసేస్తున్నారు. ఆల్రెడీ ఫస్టాఫ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ ఈ సినిమాతో పాటుగా మరిన్ని సినిమాలు ఆల్రెడీ ఈ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో మొదట అనుకున్న డేట్ నుంచి మరో డేట్ లోకి ఈ సినిమా షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. మెగా 158 ని తొలుత జనవరి 9 లేదా 12 డేట్ లలో తెద్దాం అని చూసారు. కానీ ఇపుడు జనవరి 13 కి ఇది షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ జనవరి 12న వెంకీ మామ, కళ్యాణ్ రామ్, అనీల్ రావిపూడి సినిమా ఉన్న సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ సినిమాపై అసలు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


