అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ, అనఘా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ” గుణ369″. కాగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఆగష్టు 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక గత ఏడాది కార్తికేయ హీరోగా విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి ప్రధాన కారణం అందులోని వాస్తవ కథే. ఈ ఫార్ములానే మళ్లీ గట్టిగా నమ్మి కార్తికేయ.. అర్జున్ జంధ్యాల చెప్పిన రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ‘గుణ 369’ సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సారి కూడా కార్తికేయకి రియల్ స్టోరీ హిట్ ఇస్తోందేమో చూడాలి.


