టాలెంటెడ్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త మూవీ…!

టాలెంటెడ్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త మూవీ…!

Published on Jul 19, 2019 10:00 PM IST

హీరో ధనుష్ ,టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు నేడు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. వై నాట్ స్టూడియోస్,రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు నుండి సెట్స్ పైకెళ్లనుండి. ఐశ్వర్య లక్ష్మి ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ గ్యాంగ్స్టర్ జోనర్ లో తెరకెక్కనుందట. కథ ప్రకారం సినిమా మొత్తం బ్రిటన్ లో షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల రజని కాంత్ హీరోగా పేట సినిమా తీశారు. గతంలో ఈయన తీసిన పిజ్జా,జిగర్తాండ,ఇరైవి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా స్పందించిన ధనుష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొరకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు