రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంబరాన్ని అంటింది.రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా వేడుకకు హాజరైన ప్రభాస్ అభిమానులు ఆకాశమే హద్దుగా, ప్రభాస్ పేరుని హోరెత్తించారు. సౌత్ ఇండియాలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద సినీ వేడుక జరగలేదంటే అతిశయోక్తి కాదు.
చిత్ర హీరోయిన్ శ్రద్దా కపూర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మురళి శర్మ లాంటి నటులతో పాటు టాలీవుడ్ నుండి సీనియర్ నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు లతో పాటు దర్శకుడు రాజమౌళి, వివి వినాయక్ వంటి వారు ఈ మెగా ఈవెంట్ కి హాజరై ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే దర్శకుడు సుజీత్ కి నిర్మాతలకు బెస్ట్ విషెష్ చెప్పడం జరిగింది.
వేడుక ప్రారంభం నుండి ఉరకలు వేసిన అభిమానులు, చివర్లో ప్రభాస్ స్పీచ్ మొదలు పెట్టాక వారి ఉత్సహాన్ని, ఆనందాన్ని అదుపు చేయడం ప్రభాస్ వలన కూడా కాలేదు. డార్లింగ్… డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ వేడుకను హోరెత్తిస్తుంటే, ప్రభాస్ తను మాట్లాడిన కొద్దిసేవు సమయంలో అభిమానులకు ఐ లవ్ యు చెప్పడమే సరిపోయింది.
సాహో చిత్రంలో నటించిన హీరోయిన్ శ్రద్దా తోపాటు మిగిలిన నటులకు, దర్శకుడు సుజీత్ కి అలాగే నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపిన, ప్రభాస్ తన అభిమానులకు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించి ముగించారు. ఈ వేడుక సాక్షిగా అభిమానులకి ప్రభాస్ పై ఉన్న ప్రేమని చూసిన ఎవరైనా వారు డై హార్డ్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవలసిందే.
డార్లింగ్ ఫ్యాన్స్ ని అందుకే డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు.
డార్లింగ్ ఫ్యాన్స్ ని అందుకే డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు.
Published on Aug 19, 2019 9:22 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ డైలాగ్ ఊరికే పెట్టలేదు.. హరీష్ శంకర్ క్లారిటీ
- US-Israel-Iran War Impact on India: 350 విమానాలు రద్దు, క్రాష్ అయిన మార్కెట్లు, ఆందోళనలో గల్ఫ్ కార్మికులు
- పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా సూర్య.. ‘విశ్వనాథ్ & సన్స్’ నుంచి మరో బ్యూటిఫుల్ పోస్టర్!
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ తో తెలుగు ఆడియెన్స్ నిరాశ.. ఫైనల్ గా వదిలారుగా
- ధురంధర్ 2 ట్రైలర్.. అయోమయంలో ఫ్యాన్స్..!
- వార్ ఎఫెక్ట్ : మిడిల్ ఈస్ట్ ఆశలు వదులుకోనున్న ధురంధర్ 2, టాక్సిక్..!
- షాకింగ్: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకునిపై లైంగిక వేధింపుల కేసు!
- ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్కు టైమ్ ఫిక్స్.. ఇక ‘రై రై’ అంటూ వచ్చేయడమే.!
- పోల్ : యష్ ‘టాక్సిక్’లోని ‘తబాహి’ సాంగ్ ఎలా అనిపించింది..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్?
- టాక్సిక్ : ‘తబాహి’ సాంగ్ రిలీజ్.. ఊరించి ఉసూరుమనిపించిన మేకర్స్..!
- ఎనర్జిటిక్ గా పవర్ స్టార్.. కొత్త ఊపు తెచ్చిన కొత్త పోస్టర్, మేకర్స్ గ్యారెంటీ!
- ఫోటో మూమెంట్: కొత్త పెళ్ళికొడుకు శిరీష్ తో ‘కొత్త జంట’ విజయ్, రష్మిక
- వార్ ఎఫెక్ట్ : మిడిల్ ఈస్ట్ ఆశలు వదులుకోనున్న ధురంధర్ 2, టాక్సిక్..!
- అప్పుడు ‘అనిమల్’, ఇప్పుడు ‘స్పిరిట్’.. బ్యూటీస్ కి సందీప్ అందిస్తున్న ఫేమ్
- అవైటెడ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ బ్లాస్ట్ ఎప్పుడంటే!
- విశ్వనాథ్ & సన్స్ : సూర్య కోసం వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ టైటిల్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరింది..!


