డార్లింగ్ ఫ్యాన్స్ ని అందుకే డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు.

Published on Aug 19, 2019 9:22 pm IST

రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంబరాన్ని అంటింది.రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా వేడుకకు హాజరైన ప్రభాస్ అభిమానులు ఆకాశమే హద్దుగా, ప్రభాస్ పేరుని హోరెత్తించారు. సౌత్ ఇండియాలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద సినీ వేడుక జరగలేదంటే అతిశయోక్తి కాదు.
చిత్ర హీరోయిన్ శ్రద్దా కపూర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మురళి శర్మ లాంటి నటులతో పాటు టాలీవుడ్ నుండి సీనియర్ నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు లతో పాటు దర్శకుడు రాజమౌళి, వివి వినాయక్ వంటి వారు ఈ మెగా ఈవెంట్ కి హాజరై ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే దర్శకుడు సుజీత్ కి నిర్మాతలకు బెస్ట్ విషెష్ చెప్పడం జరిగింది.
వేడుక ప్రారంభం నుండి ఉరకలు వేసిన అభిమానులు, చివర్లో ప్రభాస్ స్పీచ్ మొదలు పెట్టాక వారి ఉత్సహాన్ని, ఆనందాన్ని అదుపు చేయడం ప్రభాస్ వలన కూడా కాలేదు. డార్లింగ్… డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ వేడుకను హోరెత్తిస్తుంటే, ప్రభాస్ తను మాట్లాడిన కొద్దిసేవు సమయంలో అభిమానులకు ఐ లవ్ యు చెప్పడమే సరిపోయింది.
సాహో చిత్రంలో నటించిన హీరోయిన్ శ్రద్దా తోపాటు మిగిలిన నటులకు, దర్శకుడు సుజీత్ కి అలాగే నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపిన, ప్రభాస్ తన అభిమానులకు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించి ముగించారు. ఈ వేడుక సాక్షిగా అభిమానులకి ప్రభాస్ పై ఉన్న ప్రేమని చూసిన ఎవరైనా వారు డై హార్డ్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవలసిందే.

సంబంధిత సమాచారం :