మహేష్ బాబుకి సలహాలు ఇవ్వనంటున్న నమ్రత

మహేష్ బాబుకి సలహాలు ఇవ్వనంటున్న నమ్రత

Published on Sep 8, 2019 10:00 PM IST

Mahesh Namrata

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ రంగంలో అంతగా విజయవంతం అవడం వెనుక ఆయన సతీమణి నమ్రత పాత్ర ఎంతైనా ఉంది. మహేష్ సినిమాలకు, ఇతర వ్యాపారాలకు సంబందించిన పిఆర్ వ్యవహారాలను ఆమే స్వయంగా చూసుకుంటుంటారు. దీంతో మహేష్ ఏ సినిమాలు చేయాలో కూడా నమ్రత డిసైడ్ చేస్తుంటారనే టాక్ ఉంది బయట. కానీ వాటిలో నిజం లేదని మహేష్ పలు సందర్భాల్లో చెప్పగా తాజాగా నమ్రత సైతం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన నమ్రత మహేష్ సినిమాల విషయంలో తాను అస్సలు కలుగజేసుకోనని, మహేష్ నిర్ణయమే ఫైనల్ అని, అసలు మహేష చేయాలనుకుంటున్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటో కూడా తనకు తెలియదని అన్నారు. ప్రస్తుతం నమ్రత తమ సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ‘మేజర్’ సినిమా పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు