మాస్ హీరోల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ కావడంతో డీలా పడిపోయారు. అప్పటి వరకు బోయపాటితో ముచ్చటగా మూడవ సినిమా చేయాలనుకున్న బాలయ్య సైతం ఆలోచించే పరిస్థితి. ఇకానొక దశలో వీరి సినిమా ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా జరిగింది. అభిమానుల్లో సైతం ప్రాజెక్ట్ సెట్టవ్వదనే నిరుత్సాహం కలిగింది.
కానీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగి బాలయ్య బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛేశారు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తవగానే డిసెంబర్లో షూటింగ్ మొదలవుతుంది. వచ్చే యేడాది వేసవికి సినిమా విడుదల ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. మరి బాలయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బోయపాటి మునుపటి ఫామ్లోకి వస్తారేమో చూడాలి.


