తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంక

తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంక

Published on Sep 16, 2019 12:01 AM IST

Priyanka Arul Mohan

నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలో ఆమెకు నటనకు ప్రాథ్యమున్న పాత్రను ఇవ్వడంతో ఆమె పెర్ఫార్మెన్స్ స్కోప్ దొరికింది. ఇన్నొసెన్స్ కలిగిన పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు బాగానే ఇంప్రెస్ అయి మంచి మార్కులు ఇస్తున్నారు.

విమర్శకులు సైతం ఆమె నటన సినిమాకు కలిసొచ్చే అంశమని ప్రసంశలు కురిపించారు. మొదటి సినిమాతోనే ఇలాంటి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లభించడంతో ఇకపై మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలకు ఆమె ఒక మంచి ఛాయిస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇప్పటికే దర్శక నిర్మాతలు కొందరు ఆమెను అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు