వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుండి ఈ సినిమా టైటిల్ విషయమై వివాదం నడుస్తూనే ఉంది. సినిమాకు ‘వాల్మీకి ‘ అనే పేరుని తొలగించాలని బోయ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు.
కానీ చిత్ర టీమ్ పేరు మార్చలేదు. పైగా సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 20 దగ్గరపడుతోంది. దీంతో బోయ సామాజిక వర్గం వారు బీజేపీ సహాయం తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారంతా సినిమా పేరు మార్చాలని సెన్సార్ బోర్డ్ సభ్యులకు పిర్యాధు చేశారు. భాజాపా కలుగజేసుకోవడంతో వివాదం ముదిరినట్టైంది. మరి వారి పిర్యాధుపై సెన్సార్ బోర్డ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


