రైతుగా నటించబోతున్న స్టార్ డైరెక్టర్ !

రైతుగా నటించబోతున్న స్టార్ డైరెక్టర్ !

Published on Sep 18, 2019 11:08 PM IST

VV Vinayak

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. కాగా అక్టోబర్‌ లో వినాయక్ పుట్టినరోజున నాడు ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో వినాయక్ రైతుగా నటించనున్నారు. పైగా స్వాతంత్య్ర పూర్వం 1940ల కాలంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే వినాయక్ ఈ సినిమా కోసం ఫిట్ గా కనిపించడానికి జిమ్‌ లో కఠినంగా వర్కౌట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటివలే వినాయక్ జిమ్‌ లో కష్టపడుతున్న ఓ పిక్ సోషల్ మీడియాలో సైతం బాగా వైరల్ అయింది. కాగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వినాయక్ చాల సన్నగా కనబడాలట. ఆ సన్నివేశాలనే రెండో షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో వినాయక్ బాడీని ఇంకా తగ్గించటానికి తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా నరసింహారావు వ్యవహరించనున్నారు. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు