ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న క్రేజీ ప్రాజెక్ట్ !

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న క్రేజీ ప్రాజెక్ట్ !

Published on Sep 18, 2019 11:40 PM IST

Naga Chaitanya Sai Pallavi

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ ను కూడా షూట్ చేశారట. మొత్తానికి ఈ రోజుతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అవ్వబోతుందని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. డిసెంబర్ లో క్రిస్టమస్ సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఈ సినిమా ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ అంతా సెన్సేషనల్ పీపులే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమా మరి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఫిదా చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు