‘రచ్చ’ దర్శకుడితో గోపీచంద్ కొత్త చిత్రం.

‘రచ్చ’ దర్శకుడితో గోపీచంద్ కొత్త చిత్రం.

Published on Sep 19, 2019 10:37 AM IST

Gopichandu1

మాచో స్టార్ గోపీచంద్ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చాణక్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా ఈనెల 13న సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఓ మూవీ చిత్రీకరణ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే గోపిచంద్, కాజల్ మొదటిసారి జట్టు కట్టినట్లవవుతుంది.

కాగా నేడు హీరో గోపీచంద్ మరో కొత్త చిత్ర ప్రకటన చేశారు. యూ టర్న్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో డైరెక్టర్ సంపంత్ నంది దర్శకత్వంలో ఆయన మరో చిత్రానికి సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గౌతమ్ నంద చిత్రం రావడం జరిగింది. హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీ కి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు