లక్ష్మీ మంచు నిర్మాతగా, నటిగా, టీవీ హోస్ట్ గా అందరికి సుపరిచితురాలే. ప్రస్తుతం ఆమె మేము సైతం, మహారాణి వంటి షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన వూట్ సంస్థ కొరకు ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. స్టార్స్ తో నిర్వహించే ఈ షో కొంచెం స్పైసీ గా సాగుతుందట. ఇప్పటికే టాప్ హీరోయిన్స్ అయిన కాజల్, సమంత, రకుల్, అలాగే హీరో వరుణ్ తేజ్ తో కూడిన ప్రోమోలో మంచు లక్ష్మీ అలరించారు.
కాగా తాజాగా ఈ షో గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన షోస్‌లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్‌ని కలిసినప్పుడు నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షోతో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షోకి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్‌లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారిలో ప్రతి రోజు ఏదో చేంజ్ వస్తుంది. వారి మాటలు వారి అనుభవాల్లో నుంచి వస్తాయి. అని చెప్పుకొచ్చారు.


