నా సినిమా నచ్చకపోతే తిట్టండి ఆ దర్శకుడి ఓపెన్ ఆఫర్

నా సినిమా నచ్చకపోతే తిట్టండి ఆ దర్శకుడి ఓపెన్ ఆఫర్

Published on Sep 20, 2019 11:00 PM IST

దర్శకుడు దిలీప్ రాజా తాను రూపొందించిన చిత్రం పట్ల ఎమోషనల్ గా స్పందించారు. అలీ హీరో గా ఆయన తెరకెక్కించిన చిత్రం పండుగాడు ఫోటో స్టూడియో. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు నా సినిమా నచ్చితే తెలియజేయండి.. నచ్చకపోతే తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తిచూపండి.. సరిదిద్దుకుంటాను’’ అన్నారు . ‘పండుగాడి ఫొటో స్టూడియో’. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై ఆలీ, రిషిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు.

సెప్టెంబర్ 21న భారీగా విడుదల కాబోతోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ..‘‘ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే అది గొప్ప చిత్రం అవుతుంది. ఆలీ హీరోగా నేను తెరకెక్కించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమా మంచి కంటెంట్‌తో మీ ముందుకు రాబోతోంది. ఇందులో ఆలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకని పెళ్లిళ్లు జరుగుతున్నాయో, దానికి సంబంధించిన కారణాలు సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రంలో గొడుగు గోవిందం, చెంబు లింగం, బేడర్థణాగాడు, మెంటల్ మాలచ్చిమి, మిలట్రీమామ వంటి పాత్రలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. ఈ సినిమా కథనాన్ని దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. మంచి సజెషన్స్ ఇచ్చిన ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు