రాజమౌళి చెప్పిన ఒక్కమాట చిరు పులకరించేలా చేసింది.

రాజమౌళి చెప్పిన ఒక్కమాట చిరు పులకరించేలా చేసింది.

Published on Sep 23, 2019 7:02 AM IST

Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, వేదికలపై అలాగే పాత్రికేయుల సమావేశాలలో సందర్భోచితంగా మాట్లాడంలో దిట్ట. గత రాత్రి జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకకు విశిష్ట అతిథులలో ఒకరిగా హాజరైన రాజమౌళి తన ప్రసంగంలో ఈ కథను అందించిన సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ పై, అలాగే స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికిన తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెలుగు ప్రజలకు చేరువ చేసిన నిర్మాత రామ్ చరణ్ పై ప్రసంశలు కురిపించారు.

ఎంతో మాట్లాడాలని ఉన్నా, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వారు వెనకుండగా ఏమి మాట్లాడలేమని చెప్పారు. ఐతే చివర్లో వర్షాన్ని ఉద్దేశిస్తూ ‘ఇందాక కురిసింది వర్షం కాదండీ, సైరా యూనిట్ పై, పైన ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అక్షింతలు, ఆయన శుభాశీస్సులు’ అని చెప్పగానే…, వెనుకనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, రాజమౌళి చెప్పిన మాట గురించి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇక చిరు తన ప్రసంగంలో రాజమౌళి మరియు ఆయన తీసిన బాహుబలి చిత్రాన్ని విశేషంగా కొనియాడారు. తెలుగు కీర్తిని పెంచిన చిత్రాలలో శంకరాభరణం, బాహుబలి చిత్రాలు ప్రధమ వరుసలో ఉంటాయన్నారు. తన ప్రసంగంలో అనేక మార్లు ఆయన రాజమౌళిని ప్రశంసించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు