కొరటాల సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ?

కొరటాల సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ?

Published on Sep 24, 2019 12:01 AM IST

Chiranjeevi koratala siva

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొర‌టాల త‌న సెంటిమెంట్‌ ను బ్రేక్ చేస్తున్నాడట. కొర‌టాల మొదటి సినిమా ‘మిర్చి’ నుండి.. ఆ తరువాత కొరటాల తీసిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, మ‌హ‌ర్షి చిత్రాలకు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. దాంతో కొరటాలకి దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక సెంటిమెంట్ గా మారాడు.

అయితే మెగాస్టార్ తో కొర‌టాల చేయబోతున్న సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌డం లేద‌ని.. సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు