ఆర్ఆర్ఆర్ హీరోలు గద్దలకొండ గణేష్ కి చేసిన సాయం ఏంటంటే…?

ఆర్ఆర్ఆర్ హీరోలు గద్దలకొండ గణేష్ కి చేసిన సాయం ఏంటంటే…?

Published on Sep 24, 2019 9:24 AM IST

Gaddalakonda Ganesh1

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా అధర్వ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ”మా ‘గద్దల కొండ గణేష్‌’ సైన్మా ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. పూజ నా ఫస్ట్‌ హీరోయిన్‌. ఆమెతో కలిసి నటించడం చాలా హ్యాపీ. ‘గబ్బర్‌సింగ్‌’ చూశాక మా బాబాయ్‌కి అంత పెద్ద హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌ గారు నాకోసం కథ తీసుకువస్తారు అనుకోలేదు. నేను పర్సనల్‌గా కనెక్ట్‌ అయిందే ఎక్కడంటే మా ఇద్దరికి సినిమా తప్ప మరేదీ తెలీదు. ఆయన ఏదయినా సినిమా కోసమే చేస్తారు. మా ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతున్నారు. ఫుల్‌ సపోర్ట్‌ చేసారు.

ఈ సినిమాలో హరీష్‌ రాసిన ”సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్న కానీ ఇంత ప్రేమ ఇస్తుంది అనుకోలేదు’ అనే డైలాగ్‌ విని వెంటనే చిరంజీవి గారికి మెసేజ్‌ పెట్టాను. మీరు మీ కష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు. కానీ మా అందరికీ కూడా బంగారు బాట వేసినందుకు థాంక్స్‌ అని. ఈ సినిమా రిలీజ్‌కి ముందు టైటిల్‌ మార్చాలి అన్నప్పుడు చరణ్‌ అన్నకి ఫోన్‌ చేశాను. ఇంటికి రా అన్నారు. వెళ్తే చరణ్‌ అన్న, తారక్‌ ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఆరోజు నాకున్న స్ట్రెస్‌ని జీరోకి తీసుకువచ్చింది వారిద్దరే. ఈ సందర్భంగా వారిద్దరికీ థాంక్స్‌. అలాగే ‘గద్దల కొండ గణేష్‌ ‘చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు