అక్టోబర్ 5న ‘ఊరంతా అనుకుంటున్నారు’ !

అక్టోబర్ 5న ‘ఊరంతా అనుకుంటున్నారు’ !

Published on Sep 25, 2019 2:30 AM IST

OoranthaAnukuntunnaru

నవీన్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్ గా బాలాజీ సనాల దర్శకత్వంలో రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఊరంతా అనుకుంటున్నారు’. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.

‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ సినిమాతో నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ‘ఊరంతా అనుకుంటున్నారు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవీన్ విజయకృష్ణకు ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు