సైరా అక్కడ 100 కొట్టినా కాలర్ ఎగరేయొచ్చు.

సైరా అక్కడ 100 కొట్టినా కాలర్ ఎగరేయొచ్చు.

Published on Sep 25, 2019 10:09 AM IST

Syeraa1

కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ తీరే మారిపోయింది. నూతన దర్శకుల రాకతో విభిన్నమైన చిత్రాలు తెరకెక్కడంతో, తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ సౌత్ లోనే నంబర్ వన్ గా నిలుస్తుంది. తెలుగులో తెరకెక్కిన చాలా చిత్రాలు ఇతర భాషలలో రీమేక్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ లో తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రంగా బాహుబలి నిలిచిపోయింది. జాతీయ హోదా కలిగిన హిందీ చిత్రాలు కూడా బాహుబలి రికార్డులను సమీప కాలంలో చేరుకొనే పరిస్థితి లేదు.

బాహుబలి తరువాత హిందీలో విడుదలైన మరో భారీ చిత్రం సాహో. ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై బాలీవుడ్ ప్రముఖులు, క్రిటిక్స్ అక్కసు ప్రదర్శించారు. వాస్తవికతకు మించి దారుణమైన రివ్యూస్ రాయడం జరిగింది. కానీ అవేమి సాహో విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. అన్ని భాషలకు మించిన అతిపెద్ద విజయం సాహో అక్కడ నమోదు చేసింది. 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బురపరిచింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో భారీ చిత్రం సైరా కూడా హిందీలో భారీగా విడుదల కానుంది. 280కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ మూవీ పై కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే తెలుగు సినిమాల ఆధిపత్యం బాలీవుడ్ లో స్పష్టం అయినట్లే. కనీసం సైరా 100కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు వారు కాలర్ ఎగరేయవచ్చు. కానీ సైరా అక్కడ హ్రితిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం నుండి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. స్థానిక స్టార్ హీరోలు నటించిన ఆ భారీ యాక్షన్ చిత్రాన్ని సైరా ఏమాత్రం తట్టుకొని నిలబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు