ఆ హీరోయిన్ కమ్యూనికేషన్ వీక్…,క్రేజ్ పీక్స్, సీక్రెట్ ఏంటో?

ఆ హీరోయిన్ కమ్యూనికేషన్ వీక్…,క్రేజ్ పీక్స్, సీక్రెట్ ఏంటో?

Published on Sep 25, 2019 2:54 PM IST

Nayanthara

నేటి సమాజంలో సోషల్ మీడియా ఎంత బలమైన మాధ్యమమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సామాన్యులను సైతం ఓవర్ నైట్ స్టార్స్ ని చేయగల సత్తా దీనికి ఉంది. అందుకే బాలీవుడ్ నుండి మాలీ వుడ్ దాకా పెద్ద పెద్ద స్టార్స్ సైతం సామజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో తమ అభిమానులకు అందుబాటులో ఉంటూ తమ పాపులారిటీ తగ్గకుండా ప్రజల్లో ఉండేలా చూసుకుంటారు. కానీ వీటన్నికి నేను అతీతం అంటుంది నయనతార.

సౌత్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరుగాంచిన నయనతార భిన్నమైన వ్యక్తిత్వం గల నటి. తనకు నచ్చినట్టుగా జీవించే ఆమె, వివాదాలు, పుకార్లు, ఆమె పై వచ్చే ప్రచారాలు అస్సలు పట్టించుకోరు. అలాగే సినిమా వేడుకలలో పాల్గొనరు, పబ్లిక్ తో ఇంటరాక్ట్ కారు. మరియు నయనతార ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సామజిక మాధ్యమాలను ఉపయోగించరు. అలాంటి నయనతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె వరుస బెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది. అలాగే సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

అభిమానులకు అంత దూరంగా ఉండే నయనతార యొక్క పాపులారికి కారణమేమిటో ఎవరికీ అంతు బట్టడం లేదు. ఆమె ఇప్పుడు సౌత్లో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా ఉన్నారు. అందులో ఒకటి సైరా కాగా , విజయ్ హీరోగా వస్తున్న బిగిల్ అలాగే రజని-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దర్బార్ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు