‘గద్దలకొండ గణేష్’కు ఇంకాస్త ఎనర్జీ

‘గద్దలకొండ గణేష్’కు ఇంకాస్త ఎనర్జీ

Published on Sep 26, 2019 10:14 PM IST

గత శుక్రవారం విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం డిగ్విజయంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో వరుణ్ తేజ్ మాస్ అప్పీల్ పెరిగింది. దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి కమర్షియల్ సినిమాలు తీయడంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

మొదటి ఐదు రోజుల్లోనే చిత్రం రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక వీక్ డేస్ లో వసూళ్లు డ్రాప్ అవకుండా ఉండేందుకు చిత్ర టీమ్ జైత్రయాత్ర పేరుతో టూర్ ప్లాన్ చేసుకుని ముఖ్యమైన నగరాల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, ఏలూరు, గుంటూరు, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో విద్యార్థుల్ని, మీడియాని పలకరించిన టీమ్ రేపు విశాఖలో సక్సెస్ మీట్ జరపనున్నారు. వీటి వలన వసూళ్లు డ్రాప్ అవకుండా నిలకడగా కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు