వేణు మాధవ్ మృతి పట్ల ప్రముఖ క్రికెటర్ సంతాపం

వేణు మాధవ్ మృతి పట్ల ప్రముఖ క్రికెటర్ సంతాపం

Published on Sep 27, 2019 11:36 AM IST

Yusuf Pathan

స్టార్ కమెడియన్ రెండు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. నిన్న నగరంలోని మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్‌ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ఆయన పార్దీవ దేహాన్ని సందర్శించడంతో పాటు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఐతే వేణు మాధవ్ మృతికి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సంతాపం తెలపడం విశేషత సంతరించుకుంది. భారత క్రికెట్ జట్టు సభ్యులలో ఒకరైన యూసుఫ్ పఠాన్ ట్విట్టర్ వేదికగా” వేణు మాధవ్ మృతి కలచి వేసింది, వెండి తెరపైన నేను చూసిన అద్భుత కమెడియన్స్ లో వేణు మాధవ్ ప్రత్యామ్నాయం లేని నటులలో ఒకరు, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు. భాషలకు, ప్రాంతాలకు, రంగాలకు అతీతంగా వేణు మాధవ్ తన హాస్యంతో ఎంత మందిని కదిలించారు అనడానికి ఈ ఉదంతం చక్కని ఉదాహరణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు