‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో సీనియర్ నటుడు నరేష్ కుమారుడు ‘నవీన్ విజయకృష్ణ’ హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ‘ఊరంతా అనుకుంటున్నారు’తో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవీన్ విజయకృష్ణకు ఆయన ఆశించిన విజయాన్ని అందిస్తుందా ? సినిమా అయితే పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నవీన్ విజయకృష్ణకు ఎంతవరకు హిట్ ఇస్తోందో చూడాలి.
ఇక ఈ సినిమాలో నవీన్ విజయకృష్ణతో పాటు అవసరాల శ్రీనివాస్ హీరోలుగా మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మించారు.


