గత ఏడేళ్లలో మరణించిన టాప్ కమెడియన్స్ వీరే.

గత ఏడేళ్లలో మరణించిన టాప్ కమెడియన్స్ వీరే.

Published on Sep 28, 2019 9:42 AM IST

TFI

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి టాలీవుడ్ ప్రముఖులతో పాటు,యావత్ తెలుగు సినిమా అభిమానులను కలచి వేసింది. దాదాపు రెండు దశాబ్దాలు వేణు మాధవ్ తన హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పంచారు. గత ఐదేళ్లలో టాలీవుడ్ టాప్ కమెడియన్స్ ని కోల్పోయింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం ఎస్ నారాయణ, కొండవలస, ఆహుతి ప్రసాద్, గుండు హనుమంతు వంటి గొప్ప కమెడియన్స్ ఈ ఐదేళ్ల కాలంలో కాలం చేశారు.

టాలీవుడ్ టాప్ కమెడియన్స్ అయిన ఏవీఎస్, మరియు ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013లో మరణించడం జరిగింది. ముఖ్యంగా 2015లో మరో టాలెంటెడ్ కమెడియన్ ఎంఎస్ నారాయణ హఠాన్మరణం చెందగా, కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆహుతి ప్రసాద్ అలాగే కొండవలస గారు కూడా అదే సంవత్సరం కన్నుమూశారు. ఇక మరో కమెడియన్ గుండు హనుమంత రావు 2018లో అనారోగ్యంతో మరణించగా, తాజాగా వేణు మాధవ్ కూడా కాలేయ సంబంధ వ్యాధి కారణంగా అసువులుబాశారు.

నవ్వించడంలో వీరిది ఒక్కొక్కరిది ఒక్కో శైలి, మరియు ఎవరికి వారే ప్రత్యేకం. వీరందరూ లేని లోటు పూడ్చలేనిది. బ్రతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ గడిపిన వీరు, హాస్యాన్ని మనకు వదిలేసి అనంత లోకాలకు ఏగారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు