త్రివిక్రమ్ బన్నీ ల హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ మూవీ విజయం పై ధీమాగా ఉన్నారు బన్నీ అభిమానులు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీకి జంటగా పూజా నటిస్తుంది. కాగా వీరిద్దరి మధ్యలో ఆఫీస్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలు సెన్సిబుల్ కామెడీతో రొమాంటిక్ గా, ఆహ్లదంగా సాగుతాయట. పూజ దృష్టిలో పడటానికి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అల్లు చేసే పనులు కామెడీగా మరియు రొమాంటిక్ గా ఉంటాయని సమాచారం.
పూజ మాత్రం బన్నీని ఇష్టపడుతూనే పట్టనట్లు నటిస్తూ బన్నీట్రయిల్స్ ని ఎంజాయ్ చేస్తుందట. ఇక ఈ ఎపిసోడ్స్ కమెడియన్ రాహుల్ రామ కృష్ణ టైమింగ్ కామెడీ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ప్రాసలతో కూడిన, పంచ్ డైలాగ్స్ రాయడంలో దిట్టైన త్రివిక్రమ్ ఈ చిత్రం కొరకు గత చిత్రాలకు మించి అదిరిపోయే డైలాగ్స్ రాశారని సమాచారం. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్,టబు కీలక పాత్రలు పోస్తుండగా, హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.



