దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !

దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఏకంగా 24 గంటల్లో 5 లక్షలకు పైగా !

Published on Aug 16, 2026 12:00 PM IST

Vishwanath & Sons

సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో మంచి ఆదరణతో ప్రదర్శితమవుతోంది. ఎలాగూ పాజిటివ్ రివ్యూస్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు బలమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అటు టిక్కెట్ విక్రయాల పరంగా కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. గత 24 గంటల్లో ‘బుక్‌మైషో’ (BookMyShow)లో ఈ సినిమాకి సంబంధించి దాదాపు 5,05,710 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంటే 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

ఈ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోవడం అంటే.. ఈ సినిమా పట్ల పెరుగుతున్న ఆసక్తిని, భారీ ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా డైలాగ్స్ చాలా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాయి. మొత్తమ్మీద ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

తాజా వార్తలు