‘ఇండియన్-2’లో ప్రతినాయకుడిగా అనిల్ కపూర్ ?

‘ఇండియన్-2’లో ప్రతినాయకుడిగా అనిల్ కపూర్ ?

Published on Oct 1, 2019 4:31 PM IST

Anil Kapoor

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ ప్రతినాయకుడిగా నటిస్తారని వార్తలొచ్చాయి. కమల్ సైతం ఈ చిత్రంతో అజయ్ దేవగన్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది.

బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శంకర్, అనిల్ కపూర్ మధ్య చర్చలు కూడా జరిగాయని, ఆయన సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అందే వరకు ఆగాల్సిందే.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు