కిచ్చా సుధీప్ కన్నడలో స్టార్ హీరోగా భారీ చిత్రాలలో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగులో ప్రాముఖ్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల సుల్తాన్ పేరుతో ఫాన్ ఇండియా మూవీ విడుదల చేసిన సుధీప్ సైరా చిత్రంలో అత్యంత కీలకకమైన అవుకు రాజు పాత్రను చేశారు. నేడు సైరా మూవీ విడుదలై భారీ ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూవీలో సుదీప్ పాత్రను ప్రముఖులు కొనియాడుతున్నారు.
ఇక దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ చిత్ర యూనిట్ నటులను ప్రశంసిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన సుధీప్ “నా జీవితంలో జరిగిన అందమైన మార్పులకు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రంలో చేసిన పాత్రనే…,ధన్యవాదాలు సర్”అని రాజమౌళి పట్ల తన కృతజ్ఞత తెలియజేశారు.
Thank u @ssrajamouli sir.
Eega has been the main reason for many beautiful changes in my life.. Can never forget tat.
Mch luv to u always. ???????????????????????? https://t.co/NvIDgZk9ws— Kichcha Sudeepa (@KicchaSudeep) October 2, 2019


