మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య ఇంకా రెండు రోజులలో విడుదల కానుంది. దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్య మూవీ ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మెహ్రీన్ ఫిర్జా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్టు సమాచారం. కాగా గోపీచంద్ 28వ చిత్రం కి రంగం సిద్ధమైంది.
రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకుడిగా సీనియర్ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఇటీవల ఓ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తమన్నా మొదటిసారి గోపిచంద్ ప్రక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు అధికారికంగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను హీరోహీరోయిన్ల పై క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సీటీమార్ అనే మాస్ టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం.


